ప్రకృతి తెచ్చిన కరువును కూడా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతుంది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
*సూర్యాపేట జిల్లా…* నేరేడుచర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
*ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ*
ప్రకృతి తెచ్చిన కరువును కూడా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతుంది….
కరువు రావాలని ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీ ఆశిస్తుంది…
ఎలినో ప్రభావంతో తీవ్రస్థాయి లో నీటి ఎద్దడి ఉన్న, వాటన్నిటిని కూడా అధిగమించి రైతులకి మీరు అందించేలా కొద్ది కొద్దిగా ప్రణాళికను ముందుకి నడిపిస్తున్నామని అన్నారు…
ఇప్పుడు నీటిని పూర్తిగా వాడేస్తే కానున్న రోజుల్లో తాగునీటికి కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు….
బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ట ప్రచారాన్ని ప్రజలకు ప్రతి ఒక్క కార్యకర్త వివరించాలని పిలుపునిచ్చారు…
లిఫ్ట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుంది.. కానీ లిఫ్ట్ లో మరమ్మతులు మాత్రం పూర్తిగా రైతులు కూడా బాధ్యత తీసుకోవాలి….
లిఫ్ట్ ల మోటార్ల భద్రత కూడా రైతులే బాధ్యతగా తీసుకొని లిఫ్ట్ సరిగా పనిచేసేలా చూసుకోవాలని రైతులకి తెలిపారు..
వార్డు నెంబర్ కూడా గెలవని బిఆర్ఎస్ నాయకుడు విమర్శలు చేస్తే దాని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు…
హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రస్థాయిలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను అని తెలిపారు..
నియోజకవర్గంలోని నేరేడు చర్ల మండలం నుండి దూపాడు వరకు ఆర్ అండ్ ఆర్ రోడ్డు కోసం 19 కోట్ల 50లక్షల వ్యయంతో నిర్మించబోతున్న రోడ్డుకి శంకుస్థాపనతో పాటు నేరేడుచర్లలో లేబరేటరీ భవన శంకుస్థాపన,, చేయడం జరిగిందని తెలిపారు….
అభివృద్ధిలో ఏమాత్రం రాజీపడేది లేదని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ పవర్ నందాలాల్,, జిల్లా ఎస్పీ నరసింహ.. పలు శాఖల అధికారులు.. కాంగ్రెస్ శ్రేణులు..