కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని మేము ముందే చెప్పాం.. ఇవాళ అదే జరుగుతుంది..

సోషల్ మీడియాలో 1980‘s ట్రెండ్ నడుస్తుంది.. తెలంగాణలో 1980‘s రోజుల్లో కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడినట్లు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు..

కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని మేము ముందే చెప్పాం.. ఇవాళ అదే జరుగుతుంది..

తెలంగాణలో ప్రతి చోట కరెంట్ కోతలు ఉన్నాయని రోజూ పత్రికల్లో వస్తున్నాయి..

వీటి మీద సబ్‌స్టేషన్‌ల దగ్గరికి వెళ్లి చెక్ చేస్తే 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదు..

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని అన్నాడు..

కానీ తెలంగాణ తెచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించాం.. మళ్లీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు రేవంత్ రెడ్డి కరెంట్ లేకుండా చేస్తున్నాడు.. కేటీఆర్

మేం ముందే చెప్పాం.. కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటే కరెంట్‌ ఉండదు.. కాంగ్రెస్ కావాలా..కరెంట్‌ కావాలా..? అని మేం 2023 ఎన్నికల్లో మేం స్పష్టంగా చెప్పాం. ఇవాళ అదే జరుగుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .. మేం చెప్పిందే యధాతథంగా జరుగుతుంది. కాంగ్రెస్ ఉంటే కరెంట్‌ ఉండదని చెప్పినమో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది. కరెంట్‌ కోతలతో ఇవాళ ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు..రాష్ట్రం మొత్తం అల్లాడిపోతా ఉంది. దీనిక్కారణమేందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఒక్కసారి మీకు ముందుగా రాష్ట్రంలోని పరిస్థితి కూడా చెప్పాలి..రాష్ట్రంలోని వివిధ పేపర్లు వాటిలో వచ్చిన రైటప్స్‌ మీరు చూసినట్టైతే.. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక.. ‘’పొద్దున రాత్రి కరెంట్‌ కోతలు రాష్ట్రమంతటా.. త్రీ ఫేజ్‌ 2 గంటలు, టూ ఫేజ్‌ గంటన్నర నిలిపివేత.. రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బంది..’ మన ఆంధ్రప్రభ.. ‘భయపెడుతున్న విద్యుత్‌ సంక్షోభం, అన్ని రంగాల్లో ఇప్పటికే కోతల మోతా, వ్యవసాయం పైన సౌర్య విద్యుత్‌ అండ పగటికే’ ఈ టైప్‌లో వాళ్లు రాశారన్నారు. ఆ తర్వాత ఈనాడు ‘వరి రైతుకు కరెంట్‌ కోత’ అంటూ వ్యవసాయ రంగంలో ఎంత కరెంట్ సంక్షోభం ఉందో చాలా వివరంగా ఈనాడు పత్రికలో ఫొటోలతో సహా వాళ్లు రాశారన్నారు కేటీఆర్‌.

సోషల్ మీడియాలో 1980‘s ట్రెండ్ నడుస్తుంది.. తెలంగాణలో 1980‘s రోజుల్లో కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడినట్లు ఇప్పుడు అవస్థలు పడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రతి చోట కరెంట్ కోతలు ఉన్నాయని రోజూ పత్రికల్లో వస్తున్నాయి. వీటి మీద సబ్‌స్టేషన్‌ల దగ్గరికి వెళ్లి చెక్ చేస్తే 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదన్నారు కేటీఆర్‌.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని అన్నాడు. కానీ తెలంగాణ తెచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించాం.. మళ్లీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు రేవంత్ రెడ్డి కరెంట్ లేకుండా చేస్తున్నాడన్నారు..