హనుమకొండ జిల్లా కాజీపేట బాలాజీనగర్‌లో దారుణం కన్నతల్లిని హతమార్చిన కుమారుడు…!

హనుమకొండ జిల్లా కాజీపేట బాలాజీనగర్‌లో దారుణం కన్నతల్లిని హతమార్చిన కుమారుడు చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడని తల్లి ఉదయశ్రీని కత్తితో గొంతు కోసి హత్య ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న నిందితుడు దొరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

నుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాజీపేట డీజిల్ కాలనీ బాలాజీనగర్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విభేదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం. కన్నతల్లిని ఆమె కుమారుడే హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తుండటంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన నాగుల సుధాకర్, ఉదయశ్రీ (40)కి సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. సుధాకర్ ప్రైవేట్ కంపెనీలో అటెండర్‌గా పనిచేస్తుండగా.. ఉదయశ్రీ గృహిణిగా ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉండేవారని తెలుస్తోంది.
ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ పరిచయం క్రమంగా వివాదానికి దారితీసినట్లు సమాచారం. ఈ విషయంలో తల్లి ఉదయశ్రీని ఆమె కుమారుడు దొరబాబు పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కొంతకాలంగా తల్లి, కుమారుడి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో గురువారం మరోసారి ఇదే విషయమై ఇంట్లో తల్లితో దొరబాబుకు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆగ్రహానికి గురైన దొరబాబు తల్లిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన ఉదయశ్రీ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు, అసలు ఏం జరిగిందన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.