ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణను మరింత పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పార్టనర్షిప్ సమ్మిట్-2026కు సన్నాహాలు ముమ్మరం చేసింది. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 జరగనుండగా.. దీనికి ముందుగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 24న అమరావతి సచివాలయంలో జరిగిన సమీక్షలో సదస్సు ఏర్పాట్లు, పెట్టుబడుల స్థితిగతులు, రీజినల్ సమావేశాల నిర్వహణపై సీఎం కీలక సూచనలు చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో జరిగే ఈ సమావేశాల ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదిరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పార్టనర్షిప్ సమ్మిట్ కేవలం అవగాహన ఒప్పందాలకే పరిమితం కాకుండా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా, ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్‌ను మరింత బలోపేతం చేసేలా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులతో పాటు ఇతర కీలక అంశాలపై కూడా సదస్సులో చర్చలు జరగాలని సూచించారు. ప్రతి రీజినల్ కాన్ఫరెన్స్‌లో ఎంఎస్ఎంఈ షోకేస్ ఏర్పాటు చేసి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని అన్నారు. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించేలా ‘షార్క్ ట్యాంక్’ తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను రీజినల్ కాన్ఫరెన్సులతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...