SBI అక్టోబర్ 1, నుండి కొత్త రూల్స్.. పరిమితికి మించి నగదు ఉపసంహరించుకుంటే కస్టమర్లు ఇకపై అదనపు ఛార్జీలు..
SBI Charges Hike: కస్టమర్లకు ఎస్బీఐ భారీ షాక్..
SBI Charges How Much You Will Pay for Withdrawals After Free …
అక్టోబర్ 15వ తేదీ నుండి UPI పై ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దానికి ముందే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అక్టోబర్ 1, 2026 నుండి అమలులోకి వచ్చేలా తన కొంతమంది కస్టమర్ల కోసం నగదు ఉపసంహరణ నిబంధనలను మార్చింది..కొత్త నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన ఉచిత పరిమితికి మించి నగదు ఉపసంహరించుకుంటే కస్టమర్లు ఇకపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉండి, మీరు తరచుగా ATMలు లేదా ఇతర మార్గాల ద్వారా నగదు ఉపసంహరించుకుంటున్నట్లయితే, డబ్బు విత్డ్రా చేసే ముందు కొత్త నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఈ మార్పు ఎస్బీఐ ఖాతాదారులందరికీ వర్తించదు. ఈ నియమం ప్రత్యేకంగా బ్రాంచుల ద్వారా తెరిచిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలు ఉన్న కస్టమర్లకు వర్తిస్తుంది. అక్టోబర్ 1వ తేదీ నుండి ఏమేమి మారబోతున్నాయో, నగదు ఉపసంహరణపై విధించే ఛార్జీల గురించి తెలుసుకుందాం.
నెలలో ఎన్ని సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ లభిస్తుంది?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ప్లాట్ఫారమ్ ‘X’లో ఒక పోస్ట్లో SBI BSBD ఖాతాదారులకు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఉచిత నగదు ఉపసంహరణలకు అనుమతి ఉందని పేర్కొంది. అయితే, అక్టోబర్ 1వ తేదీ తర్వాత నెలకు నాలుగు నగదు ఉపసంహరణల వరకు ఉచితంగానే ఉంటాయి. అంటే, నాలుగు సార్లు నగదు ఉపసంహరించుకోవడానికి అదనపు ఛార్జీ ఉండదు. అయితే, మీరు నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే, అదనపు లావాదేవీ ఛార్జీలు విధించవచ్చు.