హైదరాబాద్లోని మెట్రో స్టేషన్లలో రద్దీ.
ట్రాఫిక్ డైవర్షన్స్ కారణంగా నడవని సిటీ బస్సులు.
విజయవాడ నుంచి వచ్చే ప్రైవేట్ బస్సులను..
ఎల్బీనగర్లోనే నిలిపివేస్తున్న పోలీసులు
మెట్రో రైల్ను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు.
ట్రాఫిక్ డైవర్షన్స్తో మెట్రో స్టేషన్లలో పెరిగిన రద్దీ
హైదరాబాద్లో ట్రాఫిక్ డైవర్షన్స్ కారణంగా నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో సిటీ బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని పలు మెట్రో స్టేషన్లలో రద్దీ గణనీయంగా పెరిగింది.
మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే ప్రైవేట్ బస్సులను పోలీసులు ఎల్బీనగర్ వద్దే నిలిపివేస్తున్నారు. నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు ఎల్బీనగర్ నుంచి మెట్రో రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడం, ట్రాఫిక్ డైవర్షన్లతో రోడ్డు మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడటంతో మెట్రోకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో ఉదయం వేళల్లో పలు మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.