ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ఉపయోగించి అభ్యంతరకరంగా సృష్టించిన మార్ఫింగ్ ఫోటోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పక్కన ఒక మహిళ ఉన్నట్లుగా సృష్టించిన ఏఐ ఫోటోల విషయంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరీష్ కత్పాలీయా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. మోదీ పక్కన ఒక మహిళ మార్ఫింగ్ ఫోటోను ప్రదర్శించినట్లుగా ఉన్న అభ్యంతరకరమైన కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే, ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, రత్న సింగ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సమయంలో తన మార్ఫ్ చేసిన చిత్రాలను ప్రదర్శించారని ఓ మహిళ ఆరోపించారు. తన మార్ఫ్ చేసిన, అభ్యంతరకరమైన ఫోటోలు ప్రచారంలోకి వచ్చిన తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని… దీంతో తాను ఇంటికే పరిమితమై ఉండవలసి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆ మహిళ… ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు..
ఇది కేవలం ఆ మహిళకు సంబంధించిన విషయమే కాదని, దేశ ప్రధానమంత్రికి కూడా సంబంధించినదని పేర్కొంటూ, అభ్యంతరకరమైన ఫోటోలను తక్షణమే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. “అవి సున్నితంగా లేకపోతే, వాటిని సున్నితంగా మార్చేస్తాం,” అని హెచ్చరిస్తూ సీజేపీ నాయకుల వైఖరిని హైకోర్టు కోరింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...
Next Post