ఈనెల 30 వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లు పర్శీలించడం జరిగింది.
పాల్గొన్న ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, విజయ రమణ రావు , వేముల వీరేశం ,డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ,ఇతర ముఖ్య నేతలు..
సభ ఏర్పాట్లలో భాగంగా స్థానిక నేతలకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..
స్టేజి , పార్కింగ్ , భారీకేడ్లను పరిశీలించారు రేపు సాయంత్రం లోపు పనులు పూర్తయ్యేలా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది అని అన్నారు.. సభకు భారీగా ప్రజలు ధరలు వచ్చే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్..
మంత్రులు, ఎమ్మెల్యేలకు సభ నిర్వహణ బాధ్యతలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ఈ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. సభకు జన సమీకరణ, ర్యాలీ నిర్వహణ, స్థానిక నేతల సమన్వయం, సభా ప్రాంగణంలో ఏర్పాట్ల పర్యవేక్షణ వంటి అంశాలను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇన్ఛార్జ్లుగా నియమించి సభను విజయవంతం చేసేలా పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది.