ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను గాలికి వదిలేసిన ప్రభుత్వం.. బిఆర్ఎస్వీ బొడ్డుపల్లి కృష్ణ.

ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను గాలికి వదిలేసిన ప్రభుత్వం..

-విద్యార్థుల సమస్యలను పట్టించుకోని అధికారులు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లు..

-తక్షణమే కాస్మొటిక్, మెస్ చార్జీలు విడుదల చేయాలి..

-విద్యార్థులకు అందుబాటులో లేని వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి..

– బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

దేవరకొండ………..
ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు.మంగళవారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ……హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.హాస్టల్ వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదని, అధికారులు కూడా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.హాస్టళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయడం లేదని, నాణ్యత లేని ఆహారం అందడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారుతోందని ఆయన అన్నారు. మౌలిక వసతుల కొరత, మెస్ సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు తదితర ఇబ్బందులతో విద్యార్థులు సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టళ్లలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.“కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ హాస్టళ్లను అభివృద్ధి చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వాటి పరిస్థితి దయనీయంగా మారుతోంది” అని బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న కాస్మొటిక్, మెస్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.