కరాటే పోటీలలో స్వర్ణ పతకం సాధించిన దేవరకొండ రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థిని యశశ్విని కి ఘన సత్కారం..
కరాటే పోటీలలో స్వర్ణ పతకం సాధించిన దేవరకొండ రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థిని యశశ్విని కి ఘన సత్కారం..
దేవరకొండ………
ఆడపిల్ల అడుగు బయటపెడితే ఆందోళన చెందే రోజులు కావివి ధైర్యంతో అడుగు ముందుకు వేసి ఆకాశమే హద్దుగా ఎదిగే రోజులివి
ఈ నెల సెప్టెంబర్ 27, 2026న నల్గొండ లో నిర్వహించిన 11th SHOTOKAN TELANGANA STATE KARATE CHAMPIONSHIP పోటీలలో ‘కలర్ బెల్ట్, అండర్-14’ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంతో గోల్డ్ మెడల్ సాధించిన రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థిని యశశ్విని ని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల సమక్షంలో అత్యంత వైభవంగా సత్కరించారు.
పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, స్కూల్ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, కరస్పాండెంట్ లక్ష్మి మేడమ్, దీప్తి మేడమ్, రామకృష్ణ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని యశశ్వినికి శాలువా కప్పి, మెడల్ మరియు ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు.
ఆడపిల్లలకు కరాటే రక్షణ కవచం
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ — “నేటి సమాజంలో ప్రతి అమ్మాయికి ఆత్మరక్షణ (Self-Defense) ఎంతో అవసరం. కరాటే నేర్చుకోవడం అంటే కేవలం ఒక ఆట కాదు, అది అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ధైర్యాన్ని నూరిపోసే ఒక గొప్ప శక్త్యాయుధం. శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా, ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనే గుండె నిబ్బరాన్ని ఇది ఇస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను భయంతో దాచకుండా, సమాజంలో గెలిచేలా పెంచాలి” అని పిలుపునిచ్చారు. – కరాటే మాస్టర్స్ సీనియర్ మాస్టర్ శ్రీను, మాస్టర్ ఆకాష్ కు ప్రత్యేక అభినందనలు
విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ఛాంపియన్లుగా తీర్చిదిద్దడంలో కరాటే మాస్టర్స్,అందిస్తున్న సేవలు అపారమైనవి.ఆకాష్ మాస్టర్ మూవీస్ లో ఫైట్ మాస్టర్,గా చేస్తూ,విలన్ గా నటిస్తూ,కరాటే క్లాస్ లో అత్యంత క్రమశిక్షణతో, సాంకేతిక మెళకువలతో పాటు విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని నూరిపోస్తూ మాస్టర్స్ ఇస్తున్న శిక్షణ నిజంగా ప్రశంసనీయం. ఒక సామాన్య విద్యార్థిని ని రాష్ట్ర స్థాయి ఛాంపియన్గా మార్చి, మెడలో గోల్డ్ మెడల్ పడేలా చేయడంలో వారు పడిన శ్రమ, చూపిన అంకితభావం ఎంతో గొప్పవి.వారి శిక్షణా నైపుణ్యానికి, విద్యార్థుల పట్ల ఉన్న తపనకు పాఠశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఘనంగా అభినందించారు.
తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం
ఈ వేడుకలో పాల్గొన్న యశశ్విని తల్లిదండ్రులు మాట్లాడుతూ — “పాప మెడలో గోల్డ్ మెడల్ పడుతుంటే, మా కళ్లలో మాటల్లో చెప్పలేని సంతోషం ఉప్పొంగింది. ఆడపిల్ల అంటే భారం కాదు… మన ఇంటికి గర్వకారణం అని మా బిడ్డ నిరూపించింది. సరైన శిక్షణ, ప్రాత్సాహం లభిస్తే ఆడపిల్లలు సాధించలేనిది ఏదీ లేదు” అని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యశశ్విని కి కరాటే నేర్పించిన మాస్టర్లకు శుభాకాంక్షలు తెలియజేసినారు.