అప్పులు చేసి కట్టిన హోటల్ నేలమట్టం – దేవరకొండలో గిరిజన యువకుడు వడ్త్య శ్రీను నాయక్ కన్నీటి వ్యథ..
దేవరకొండ………
దేవరకొండ ప్రభుత్వ కళాశాల ఎదుట గత రెండేళ్లుగా హోటల్ నడుపుతున్న ఘాజీ నగర్ తండాకు చెందిన వడ్త్య శ్రీను నాయక్ కు తీవ్ర అన్యాయం జరిగింది. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన స్థల యజమాని శ్రీనివాసరావు 10 ఏళ్ల లీజు పేరుతో 10 లక్షలు అడ్వాన్స్ తీసుకుని, ఇప్పుడు ఎటువంటి నోటీసు లేకుండా రౌడీలతో దాడి చేయించి, హోటల్ లోని సామాను ఎత్తుకెళ్లి ధ్వంసం చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. హోటల్ నిర్మాణానికి 20 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పుడు అప్పుల పాలయ్యానని వడ్త్య శ్రీను నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.