దేవరకొండలో గాంధీ విగ్రహం ఎదుట పోస్ట్ కార్డులతో జర్నలిస్టుల నిరసన..!

దేవరకొండలో గాంధీ విగ్రహం ఎదుట పోస్ట్ కార్డులతో జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ .

టీయూడబ్ల్యూజే 143దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్

దేవరకొండ………..
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత విషయమై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్ లెస్ హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని టియుడబ్ల్యూజే143 దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే 143 రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని దేవరకొండలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు నిరసనతో పాటు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే 143 దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే ప్రక్రియలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అలాగే జర్నలిస్టుల హక్కుల సాధనకు జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాడాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, జర్నలిస్టులపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దేవరకొండతో పాటు అన్ని మండల కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట జర్నలిస్టులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి పోస్టుకార్డులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు ఈనెల 8 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కై కార్యక్రమాలు నిర్వహించినట్లు అందుకు నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో
టీయూడబ్ల్యూజే 143 దేవరకొండ డివిజన్ కోశాధికారి సముద్రాల వేణు, యూనియన్ నాయకులు ముష్ని అంజన్, హాథిరాం నాయక్, నల్లగాసు నవీన్ కుమార్, జంతుక లింగం, పోలగొని సైదులుగౌడ్, మణికంఠ చారి, వెంకటరమణ, రాజశేఖర్, బత్తుల సురేష్, తిరుపతి, మహేష్, రవి, బొడ్డు మల్లేష్ గౌడ్, అంజిబాబు, శంకర్, మోహన్, చంద్రమౌళి, ఆర్య శీను తదితరులు పాల్గొన్నారు.