ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు (India’s Mens Cricket Team) మరోసారి స్వర్ణ పతకం (Gold Medal) సాధించింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51 నాటౌట్) మెరుపులు…శ్రేయాస్ సేన’ ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాక్ బృందాన్ని చిత్తు చేసి ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆఖరి ఓవర్లలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (51 నాటౌట్) కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. వీరికి తోడుగా శివమ్ దూబే (27), సంజు శాంసన్ (21), ఇషాన్ కిషన్ (20) పరుగులు జోడించడంతో భారత్ 200 మార్కును సులువుగా దాటింది. పాక్ బౌలర్లలో అహ్మద్ దనియల్, అరాఫత్ చెరో రెండు వికెట్లు తీయగా.. సైమ్ అయూబ్, అబ్రార్ చెరో వికెట్ పడగొట్టారు..టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. దాంతో పాక్‌పై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో 2025లో దుబాయ్‌లో 24 బంతుల్లో సాధించిన తన రికార్డును తానే అధిగమించాడు. అభిషేక్ 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.
ఆ తర్వాత తిలక్ వర్మ తనదైన శైలిలో చెలరేగిపోయి ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. శివమ్ దూబేతో కలిసి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పాక్‌కు హసన్ నవాజ్ అండగా నిలిచాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 51 బంతుల్లోనే 96 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సైమ్ అయూబ్ (29) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసి పాక్ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. చివర్లో శివమ్ దూబే కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో పాక్ 20 ఓవర్లలో లక్ష్యానికి 19 పరుగుల దూరంలో ఆగిపోయింది. భారత్ ఘన విజయంతో స్వర్ణం దక్కించుకుంది. కాగా ఈ క్రీడల్లో ఇప్పటికే మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం సాధించింది.
నవాజ్ పోరాటం వృథా.. తడబడిన పాకిస్థాన్..
212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి క్రమంగా వికెట్లు కోల్పోయి ఛేదనలో విఫలమైంది. పాక్ బ్యాటర్లలో హాసన్ నవాజ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 51 బంతుల్లో 96 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించేందుకు చివరి వరకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఇతర బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో అతని పోరాటం వృథాగా మిగిలిపోయింది. అద్భుత బౌలింగ్, పక్కా ప్రణాళికలతో పాకిస్థాన్‌ను కట్టడి చేసిన భారత జట్టు, ఆసియా క్రీడల ఫైనల్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుని దేశానికి బంగారు పతకాన్ని అందించింది…