ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ఉత్కంఠకు తెరదించింది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మను మరోసారి ఎంపిక చేసింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ మేనెజ్‌మెంట్‌ ఎక్స్‌ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల అతడు పంజాబ్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ కావడంతో రోహిత్‌కు తిరిగి జట్టు పగ్గాలను ఎంఐ యాజమాన్యం కట్టబెట్టింది. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే ముంబై కెప్టెన్‌గా అతడికి అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. రోహిత్ 2013 నుంచి 2024 వరకు ముంబై జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌ శర్మ నాయకత్వంలో ముంబై జట్టును ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే 2024 సీజన్‌కు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

2024 సీజన్‌లో జరిగిన అవమానం కారణంగా రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్సీ తీసుకోవడానికి అంగీకరించకపోవచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. తిలక్ వర్మ లేదా సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగింది. అయితే రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించాడు…