నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులు
ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి..
ఇన్స్టాగ్రామ్లో గత కొంత కాలంగా “పర్పుల్ క్రెయిన్ 00” అనే ఖాతా ద్వారా తనపై, తన కుటుంబసభ్యులపై అసభ్య పోస్టులు, కామెంట్లలో దూషణలు చేస్తున్నారని ఫిర్యాదు..
ఆ ఖాతాకు సంబంధించిన వ్యక్తిపై చర్యలు తీసుకొని, దూషణలకు పాల్పడిన పోస్టులను తొలగించాలని కోరిన లావణ్య త్రిపాఠి..
ఐటీ చట్టం సెక్షన్ 67, BNS 78,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు..