సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ ఒకరు. తనదైన కామెడీ, ప్రత్యేకమైన మాటతీరు, హావభావాలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. కిరణ్ చేసే రీల్స్, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించేది. అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కిరణ్ పెద్దగా కనిపించడం లేదు. రీల్స్, వీడియోలు చేయకపోవడంతో ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ ఏమయ్యారు? అంటూ అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్త వెలుగులోకి వచ్చింది…
సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అగ్గిపెట్ట మచ్చ.. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలలో కూడా కనిపించాడు. అయితే తాజాగా అతడికి సంబంధించి ఓ విషాదకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన కిరణ్ ప్రస్తుతం అతడు వెంటిలేటరప్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
సోషల్ మీడియా సెన్సేషన్ నుండి టీవీ షోల వరకు.
తిరుపతి ప్రాంతానికి చెందిన కిరణ్, ‘అగ్గిపెట్టె మచ్చ’ పేరుతో డిజిటల్ మాధ్యమాల్లో రాత్రికి రాత్రే గుర్తింపు తెచ్చుకున్నారు. నాటు సంభాషణలు, అమాయకత్వంతో కూడిన ఎక్స్ప్రెషన్లతో కామెడీ చేస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్, ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. దీంతో సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన రీల్స్, వీడియోలే కనిపించేవి..
అసలు ఆయన ఎక్కడున్నారు అనే చర్చ మొదలైంది. అయితే, ఆయన ఆకస్మికంగా తీవ్ర అనారోగ్యానికి గురై తిరుపతి స్విమ్స్లో ప్రాణాలతో పోరాడుతున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ పాత ఉత్సాహంతో మన ముందుకు వచ్చి అందరినీ నవ్వించాలని పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ప్రార్థిస్తున్నారు. కాగా, కిరణ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్విమ్స్ ఆసుపత్రి వర్గాల నుంచి మరింత స్పష్టమైన అధికారిక సమాచారం రావాల్సి ఉంది..