దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు (కరువు భత్యం) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రెండు డీఏలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డీఏల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 01.01.2024 నుండి కరువు భత్యం (DA) ప్రాథమిక వేతనంలో 33.67% నుండి 37.31%కి పెంపు. 01.07.2024 నుండి డీఏను 37.31% నుండి 40.04%కి పెంచుతూ ఉత్తర్వులు జారీ. పెంచిన డీఏను అక్టోబర్ 2026 వేతనంతో కలిపి నవంబర్ 1, 2026న చెల్లిస్తారు. ఉద్యోగుల అర్హతను బట్టి పాత బకాయిలు జీపీఎఫ్ (GPF) ఖాతాలో జమ చేయబడతాయి లేదా సీపీఎస్ (CPS)/కాంటింజెంట్ ఉద్యోగులకు సమాన వాయిదాలలో చెల్లించబడతాయి. అని ప్రకటన ద్వారా తెలిపారు..