శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాతావరణం కారణంగా విమానాల దారి మళ్లింపు..
పలు రూట్లకు విమానాలు రద్దు…
హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను అధికారులు ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు..
అదే సమయంలో ఢిల్లీ, చండీగఢ్, రాంచీ, వారణాసి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దైనట్లు సమాచారం. వాతావరణ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రయాణికులు విమానాల స్థితిగతులపై ఎయిర్లైన్స్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959