పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు…మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి” అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు..!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ .ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ”మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి” అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

పాకిస్థాన్‌లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్‌ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

”భారత్‌లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్‌లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు” అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు..నీట్‌ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్‌ లీక్‌ ఆరోపణలు, గ్రేస్‌ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం-నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు..