శనివారాలు సెలవు ప్రకటిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా నకిలీ గెజిట్ నోటిఫికేషన్.!

నకిలీ గెజిట్: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (SBI సహా) అన్ని శనివారాలు సెలవు ప్రకటిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఈ గెజిట్ నోటిఫికేషన్ నకిలీది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)తో సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం ప్రతి శనివారాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించిందని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ప్రభుత్వ గెజెట్‌ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గురువారం నకిలీదని కొట్టివేసింది.

ప్రభుత్వ స్పష్టత: భారత ప్రభుత్వ అధికారిక వాస్తవ నిర్ధారణ విభాగం (PIB Fact Check) దీనిపై వివరణ ఇస్తూ, అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది.

ప్రస్తుత నిబంధన: ప్రస్తుతానికి నిబంధనల ప్రకారం ప్రతినెల రెండో, నాల్గో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మిగిలిన (ఒకటో, మూడో, ఐదో) శనివారాల్లో బ్యాంకులు సాధారణ పనిదినాలుగానే కొనసాగుతాయి..

కాబట్టి, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ గెజిట్ పత్రం అసలైనది కాదు