ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ క్రికెట్‌కు వీడ్కోలు…

ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. మహిళా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన హీలీ చిరస్మరణీయ శతకంతో జట్టును గెలిపించి.. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది. స్వదేశంలో భారత జట్టులో సిరీసే తనకు ఆఖరిదని ఇదివరకే ప్రకటించిన ఆమె.. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి సగర్వంగా ఆట నుంచి వైదొలిగింది. కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో జట్టున నడిపించడం.. ఏకంగా 158 రన్స్‌ చేయడం.. వన్డే ఛాంపియన్‌ భారత జట్టుపై 3-0తో సిరీస్ విజయం నిజంగా అద్భుతమే కదా..ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 2010లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తను తొలి మ్యాచ్ ఆడింది. వికెట్ కీపర్‌గా, విధ్వంసక ఓపెనర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీలీ మూడేళ్ల క్రితం కెప్టెన్సీ చేపట్టింది..