నేటి పంచాంగం..అమావాస్యకు చేయాల్సిన పరిహారాలు ఇవే..!

*_జూన్ 15, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*అధిక జ్యేష్ఠ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి : *అమావాస్య*
ఉ 9.15
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *మృగశిర* రా 9.09
యోగం: *శూలం* ఉ 10.37
కరణం: *నాగవ* ఉ 9.15
*కింస్తుఘ్నం* రా 8.00
వర్జ్యం: మర్నాడు *తె 4.58 నుండి*
దుర్ముహూర్తము: *మ 12.43 – 1.35*
*మ 3.20 – 4.13*
అమృతకాలం: *రా 12.57 – 2.26*
రాహుకాలం: *ఉ 7.21 – 8.59*
యమగండం: *ఉ 10.38 – 12.17*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *వృషభం*
సూర్యోదయం: *5.43*
సూర్యాస్తమయం: *6.50*

హిందూ ధర్మంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం సోమావతీ అమావాస్య ఈ నెల 15వ తేదీన రానుంది. అమావాస్య, జ్యేష్ఠ అధిక మాసం కలిసి రావడం వల్ల ఒక అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దాదాపు మూడేళ్ల కాలానికి ఒకసారి సంభవించే ఈ విశిష్ట సందర్భం, పితృ తర్పణాలకు, దానధర్మాలకు, హరిహరుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. సోమవారం నాడు అమావాస్య రావడం, అది అధిక మాసంలో ఉండటం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది…
జ్యేష్ఠ అధిక మాస అమావాస్య తిథి 14న మధ్యాహ్నం 12:19 నిమిషాలకు ప్రారంభమై, 15న ఉదయం 8:23 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథిని ప్రామాణికంగా తీసుకుని జూన్ 15న సోమవతి అమావాస్యను జరుపుకోవడం ఆచారం. ఈ రోజున చేసే స్నానం, పూజలు, పితృ కార్యాలు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం…
ఆధ్యాత్మిక ఆచారాలతో పాటు కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. నువ్వులతో కలిపిన పిండితో రొట్టెలు చేసి ఆవులకు తినిపించడం, చేపలకు పిండి ముద్దలను వేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సాయంత్రం వేళ ఇంటి ఈశాన్య మూలలో ఎరుపు దారం వత్తితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది…రావి చెట్టుకూ ప్రత్యేకత ఉంది. అమావాస్య రోజున పితృదేవతలు పీపుల్ చెట్టులో నివసిస్తారని నమ్మకం. ఈ చెట్టుకు పాలు, తీపి కలిపిన నీటిని సమర్పించి, ప్రదక్షిణలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, పితృ శాంతి కోసం శ్రీమద్భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేయడం అత్యంత ప్రయోజనకరంగా భావిస్తారు. విత్తనం నాటడం లేదా మొక్కలను నాటడం కూడా పుణ్యకార్యంగా పరిగణిస్తారు..పవిత్ర నదులలో స్నానం ఆచరించడం ప్రధాన ఆచారం. నదికి వెళ్లడం సాధ్యం కాని పక్షంలో, ఇంట్లోని నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. గరుడ పురాణం ప్రకారం, ఈ రోజున పితృ తర్పణాలు విడిచిపెట్టడం వల్ల పితృ రుణం తీరుతుందని చెబుతారు. స్నానానంతరం పేదవారికి ఆహారం, వస్త్రాలు లేదా ధనదానం చేయడం, గోశాలలో ఆవులకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు..పితృ దేవతల ప్రసన్నత కోసం అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో గోమయ పిడకలపై బెల్లం, నెయ్యి ఉంచి హోమం చేయడం శుభప్రదం. అరచేతిలోకి నీటిని తీసుకుని, బొటనవేలి ద్వారా పితృదేవతలకు తర్పణం అర్పించాలి. శివాలయాల్లో రుద్రాభిషేకం చేయడం, వీలైనంత వరకు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం చేయాలి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి…అమావాస్య రోజున సూర్య, చంద్రులు ఒకే రాశిలో ఉండటంతో, ఖగోళపరంగా కూడా ఇది ప్రాముఖ్యత ఉంది. అగ్నితత్వానికి ప్రతీకగా సూర్యుడు, శీతలత్వానికి చంద్రుడు ఉంటారు. ఈ సమయంలో చంద్రుని ప్రభావం తక్కువగా ఉండటం వల్ల, మనసును కేంద్రీకరించి ధ్యానం చేయడానికి ఇది అనువైన సమయం. పద్మ పురాణం ప్రకారం, సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాప విముక్తి కలుగుతుంది.
ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*

*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*