గుంటూరులో రాజకీయం రణరంగాన్ని తలపించింది…
మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి..
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించారు..
ఈ క్రమంలో అంబటి కారును, ఇంటిలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అంబటిపై హత్యాయత్నం జరిగిందని, ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. భారీగా మోహరించిన పోలీసులు ఉద్రిక్తతల నడుమ అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు…