త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు.. డెన్వర్ విమానాశ్రయంలో ఘటన
మంటలను గుర్తించి ప్రయాణికులను వెంటనే బయటకు పంపిన సిబ్బంది..
అమెరికన్ అంతర్జాతీయ డెన్వర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ AA3023 ల్యాండింగ్ సమయంలో గేర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు కమ్ముకోవడంతో విమానంలో 173 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే విమాన సిబ్బంది సురక్షితంగా వారిని తరలించారు. ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్న సమయంలో ఇలాంటి భయాందోళనకు గురి చేసే ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. బోయింగ్ 3737 మాక్స్ విమానం నుండి మాయామికి రన్వే 34 ఎల్ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది…ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవ్వలేవు. వారు సురక్షితంగానే ఉన్నారు ప్రధానంగా విమానం టైర్ల సమస్య తలెత్తినందున రన్వేపై ఆపాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు . విమానం శనివారం మధ్యాహ్నం 1:12 గంటలకు గేట్ సి3 నుండి బయలుదేరాల్సి ఉండగా 2: 45 గంటలకు టేకాఫ్ అయ్యే సమయంలో ల్యాండింగ్ గేర్ లో ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను వెంటనే బస్సుల ద్వారా టెర్మినల్ కు తరలించారు.
https://x.com/DogRightGirl/status/1949253952958238999
అగ్నిమాపక శాఖ కూడా మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రన్ వే మధ్యలో ఉన్న విమానం టైర్లు మంటల్లో కాలిపోతున్న సమయంలో దట్టమైన పొగలు కూడా ప్రాంతంలో చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనతో పరుగులు తీస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధానంగా సిబ్బంది అప్రమత్తతో వెంటనే వాళ్ళని కాపాడారు. అయితే కొద్ది సమయం పాటు డెన్వర్ విమానాశ్రయం కూడా మూసివేశారు. కొన్ని విమానాల ప్రయాణ సమయంపై ఈ ప్రభావం పడింది..