ఇరాన్ కీలక ప్రకటన..హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటన..

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు..

ఇరాన్ కీలక ప్రకటన

అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్(america iran war) కూడా సానుకూలంగా స్పందించింది. రానున్న రెండు వారాల పాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చి అధికారికంగా ప్రకటించారు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే, తాము కూడా దాడులకు వెళ్ళమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్‌తో సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని నౌకల రాకపోకలకు అనుమతినిచ్చారు.

అమెరికాతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరినప్పటికీ యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది. తాము ప్రతిపాదించిన 10 సూత్రాలకు ఆమోదం లభించినప్పుడు మాత్రమే యుద్ధానికి ముగింపు లభిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన చర్చలు పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో ఈ నెల 10వ తేదీన చర్చలు ప్రారంభమవుతాయని తెలిపింది. తమకు అమెరికాపై నమ్మకం లేదని.. అయినప్పటికీ ఈ చర్చల కోసం రెండు వారాల సమయం ఇచ్చామని పేర్కొంది. అవసరమైతే పరస్పర అంగీకరాంతో గడువు పొడిగించే అవకాశం కూడా ఉందని చెప్పింది.