ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం..!

ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల గురించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు…మహిళలను ఉద్దేశించి అసహ్యకరమైన భాషను ఉపయోగించడం.. వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదన్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

‘ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే. వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్న అనే దానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘MAVIGUN’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను.. దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం.

మావిగన్‌ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక బాబు, ఎల్లో మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకూ దిగారు. మేం శాంతియుతంగా నిరసనలు చేపట్టాం. రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాం. ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడలేదు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. అత్యంత సంయమనంతో వ్యవహరించారు’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు…