భరద్వాజ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చిన అనసూయ..పబ్లిక్‌గా ఈ రొమాన్స్ ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్లు..

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఈ భామ.. తన ఎప్పటికప్పుడు తన అప్‌డేట్‌లను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అంతేగాక, తన హాట్ ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంటుంది. ఇవాళ (జూన్ 4) అనసూయ పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీతో బీచ్‌కు వెళ్లింది. ఈ సదర్భంగా బికినీ ధరించి సాగర తీరాన రెచ్చిపోయింది. భర్త భరద్వాజ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కొందరు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొందరు పబ్లిక్‌గా ఈ రొమాన్స్ ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్లతో వారిపై విమర్శలు చేస్తున్నారు.