శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి అనంతరం సీఎం చంద్రబాబు – ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల..!
CM చంద్రబాబు శ్రీశైలంలో .. జులై తొలివారంలోనే నిండు కుండలా నిండిన శ్రీశైలం ప్రాజెక్టు..
శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ప్రవాహం వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి చంద్రబాబు జలాశయం గేట్లను ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది..
ఈ నెల 11వ తేదీన హంద్రీనీవా పంపులు ప్రారంభిస్తున్నాం.. ఈనెల 15 నాటికి జీడిపల్లికి నీళ్లు రావాలని టార్గెట్ పెట్టుకున్నాం.. ఈనెల 30 నాటికి కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తాం……
తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజు అని చంద్రబాబు పేర్కొన్నారు. జులై తొలివారంలోనే శ్రీశైలం నిండటం శుభపరిణామమని తెలిపారు. పైనుంచి వచ్చిన జలాలతో ప్రాజెక్టు నిండుగా ఉందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 200 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించానని రాయలసీమ రతనాల సీమ కావాలని ఆయణ్ని ప్రార్థించినట్లు చెప్పారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు. జలాలే మన సంపద వాటితోనే రైతుల కష్టాలు తీరతాయని సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
“రాయలసీమను ఎవరూ కాపాడలేరని గతంలో చాలామంది అన్నారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చేందుకు ఎన్టీఆర్ నడుం బిగించారు. రాయలసీమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తున్నాను. సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,000ల కోట్లు ఖర్చు చేశాం.గత ప్రభుత్వం ఐదేళ్లపాటు రాయలసీమను పట్టించుకోలేదు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వానిదే