ఏపీలో హింసను రెచ్చగొట్టే కుట్రలు – వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో హింసను రెచ్చగొట్టే కుట్రలు – వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఆయన ప్రకారం. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు చంద్రబా

సోమవారం టీడీపీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వైసీపీ వేసే ట్రాప్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పడొద్దని ఆయన సూచించారు.

మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నేతలతో విస్తృతంగా చర్చించారు. వైసీపీ ప్రోద్భలాలకు లోనుకాకుండా ప్రజల్లో శాంతి, స్థిరత్వం నిలబెట్టేలా వ్యవహరించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు…

పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన అజెండా.. రాష్ట్రాభివృద్ధి వైసీపీకి నచ్చట్లేదు.. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతాం. వైఎస్సార్‌‌సీపీ నేతలు అలజడి సృష్టించేందుకే బూతులు మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై పుట్టింది.. ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ.. మనకీ తేడా ఉండదు.. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలి. కార్యకర్తలు చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దు.. పార్టీ నేతలు పరిస్థితిని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి’ అన్నారు చంద్రబాబు.’వైఎస్సార్‌సీపీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంలో అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయాలన్ని ప్రజలకు తెలిసి ఆ పార్టీని చీదరించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలను దారి మళ్లించాలనే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధి ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదు.. అందుకే ఇలా కుట్రలు చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’ అన్నారు… అంతకముందు కూడా రాష్ట్రంలో తాజా పరిణామాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘నేరమయ రాజకీయాలు వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం. వారి హయాంలో జరిగిన చట్టవిరుద్ధ పాలనే దీనికి నిదర్శనం. 2024 తర్వాతే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది. ప్రజలకు సేవ చేయటం వారికి సాధికారిత కల్పించటం మా సిద్ధాంతం. వైఎస్సార్‌సీపీ నిజ స్వరూపం బయటపడుతున్న కొద్దీ అసహనంతో దూషణలకు దిగుతున్నారు. వాళ్లు విధ్వంసం చేసిన వ్యవస్థలు పునర్నిర్మాణం జరుగుతున్న తీరును చూసి ఓర్వలేక పోతున్నారు. రాజ్యాంగమే సుప్రీం. మేం నెలకొల్పిన శాంతిభద్రతల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరుతాం. చట్ట ఉల్లంఘనలకు ఎవరినీ అనుమతించేది లేదు’ అన్నారు చంద్రబాబు.