ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ.. సీఎం చంద్రబాబు…

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న’స్త్రీ శక్తి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు….. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్ 2047 తెస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తీసుకొచ్చామన్నారు. మహిళల ముఖాల్లో ఆనందం చూడటం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు చంద్రబాబు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తేవటం, వారి గౌరవం మరింత పెంచే విధంగా ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగే స్వేచ్ఛ మహిళలకు కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇపుడు సగర్వంగా చెబుతున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు..విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.