పదవులు మీకే పైసలు మీకే అని కొద్దిరోజుల క్రితం అన్నాను… ఎవ్వరిని అన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ని అన్నాను… సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి…

మరోసారి తనదైన శైలిలో సీఎం రేవంత్ రెడ్డి పై చావకులు చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి…

మాట్లాడుతూ..
https://youtu.be/s5yMA1HsoUQ?si=L96E5Ai_d_JjnKR9
పదవులు మీకే పైసలు మీకే అని కొద్దిరోజుల క్రితం అన్నాను… ఎవరినన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ని అన్నాను తెలుసు కదా అని కార్యకర్తలనుతో అన్నారు..

నాకు గత 20 నెలల నుండి అర్ధమైంది ఏమిటి అంటే.. మన మునుగోడులో నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు సిసి రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదు.. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా కూడా రాలే.. వందసార్లు తిరిగిన రాలేదు…

కాంట్రాక్టర్లు వలిగొండ చౌటుప్పల్ రోడ్డు చేయడం లేదు… పని చేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు ఈ చెల్లించమని అంటున్నారు..

బిల్లు ఏమో నా చేతిలో లేదు… ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది…

నేను ముఖ్యమంత్రిని విమర్శించలేదు.. పార్టీని విమర్శించలేదు..

ప్రజలేము నన్ను అడుగుతున్నారు.. ప్రజలు నన్ను పని చేయమని అంటున్నారు.. పదవులలో మీరే ఉంటారు,, పైసలు మీరే తీసుకుంటున్నారు,, మీ నియోజకవర్గాలకు పైసలు పోతున్నాయి… కనీసం నాకు పదవి ఇవ్వనందుకు మా నియోజకవర్గానికి డబ్బులు అయినా ఇవ్వండి…..

పదవులు మీరే తీసుకోండి పదవులు అనుభవించండి.. నాకు అన్యాయం చేసిన పర్వాలేదు నా మునుగోడు నియోజకవర్గంనికి నిధులు ఇవ్వండి.. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి.. మునుగోడు నియోజకవర్గం సహకరించండి సహకరించండి..

నాకన్నా మంచోడు దొరుకుతాడని అని సభలు కార్యకర్తలు ఉద్దేశించి అన్నారు..

మీకోసం నాకు అన్యాయమైన పర్వాలేదు అని అంటున్నాను.. ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధికి అటకగలకుండా డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాను..

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోండి… నాతోపాటు ఉంటే నేను పోరాడుతాను.. మళ్లీ ఎక్కడికైనా పోతే రమ్మంటే మళ్ళీ డబ్బులు అడిగే వారిని ఎన్నుకోకుండా మంచివారిని ఎన్నుకోండి అని అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు..

పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది… నాకు పదవి వస్తే ఒక బాధ్యత తప్ప అది వస్తే ప్రజలకి మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుంది అన్నారు..

పదవి వచ్చేటప్పుడు వస్తుంది మనల్ని ఎవరు ఆపలేరు,, ఆప్తే మనం ఊరుకుంటామా.. నేను ఊరుకునే మనిషినేనా అని అన్నారు.. నేను ప్రతిసారి మీ గురించి ఆలోచిస్తున్నా..

ఇంకా మూడున్నర ఏళ్ల సమయం ఉంది.. ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది.. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకోసం పనిచేస్తానని అన్నారు..