ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

రాష్ట్రంలో ఉత్పత్తి అయిన స్వచ్ఛమైన బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. ‘మేడిన్ జొన్నగిరి’ బంగారు బిస్కెట్ల విక్రయాలు మొదలయ్యాయి. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతానికి చెందిన ఈ గోల్డ్ బిస్కెట్లను కర్నూలులోని ప్రముఖ దుకాణాలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. ఈ బిస్కెట్లపై ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను ముద్రించడం విశేషం.వీటిని కొనేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్..

ఈ జొన్నగిరి బంగారు బిస్కెట్లపై ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర మ్యాప్‌ను ముద్రించడం విశేషం. ఇది స్థానిక మార్కెట్‌లో, కొనుగోలుదారులలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మన సొంత రాష్ట్ర గనుల నుండి వచ్చిన బంగారం కావడం, దానికి తోడు ఏపీ మ్యాప్ ముద్రించి ఉండటంతో వీటికి మార్కెట్‌లో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ లభిస్తోంది. పసిడి ప్రేమికులు, పెట్టుబడిదారులు ఈ సరికొత్త ఆంధ్రా గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు…