India vs Ireland. భారత్‌పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం..!

India vs Ireland
భారత్‌పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 50 (20 బంతుల్లో) మెరవగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అంతకుముందు ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. టీమిండియా 18.5 ఓవర్లలోనే కేవలం 148 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుండి ఆశించిన మద్దతు లభించకపోవడంతో అతని పోరాటం వృథా అయ్యింది…

నిలబెట్టిన టకర్, డెలానీ భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ లోర్కాన్ టకర్ (36 బంతుల్లో 50), గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును సంక్షోభం నుంచి గట్టెక్కించారు. వీరిద్దరూ అద్భుత భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. చివర్లో జార్జ్ డాక్రెల్ (10 బంతుల్లో 19) మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లతో, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లతో మెరిసినా.. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చుకోవడం జట్టును దెబ్బతీసింది..టపటపా నాలుగు వికెట్లు పడిన దశలో టక్నర్, డెలానీ నిలబడ్డారు. మరో వికెట్ పడకుండా.. రన్‌రేటు తగ్గకుండా స్కోర్ బోర్డును నడిపించారిద్దరూ. దూబే ఓవర్లో ఫోర్, డబుల్స్‌లో ఐరిష్ సారథి అర్ధ శతకం సాధించాడు. కానీ హర్షిత్ ఓవర్లో టక్నర్.. తిలక్ వర్మ చేతికి చిక్కడంతో 115 వద్ద ఐదో వికెట్ పడింది. డెత్ ఓవర్లలో గేర్ మార్చిన గెలానీ బౌండరీలు రాబట్టగా.. ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది..

పేకమేడలా కూలిన మిడిలార్డర్.

అభిషేక్ నిష్క్రమణ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) ఘోరంగా నిరాశపరిచారు. తిలక్ వర్మ (19), శివమ్ దూబే (25) కాసేపు క్రీజులో నిలిచి పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఐర్లాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఐరిష్ బౌలర్లలో మాట్ హొలార్డ్, మాథ్యూ హంఫ్రీస్ చెరో 3 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. దీనితో భారత జట్టు 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయి పరాజయాన్ని చవిచూసింది.