ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసన ఉధృతం
నేటి నుంచి ఫేజ్-3 ఆందోళనకు APJUDA పిలుపు.
నేటి నుంచి అత్యవసర సేవలూ బంద్
ఐసీయూ, ఎమర్జెన్సీ సేవల నిలిపివేతకు జూడాల నిర్ణయం.
ఉపకారవేతనం పెంపుపై రాతపూర్వక హామీ కోరుతున్న జూడాలు.
జూనియర్ డాక్టర్ల నిరసనకు ఏపీ ఐఎంఏ మద్దతు..
రాష్ర్టంలో జూనియర్ డాక్టర్ల (జూడా) ఆందోళన ఉధృతం కానుంది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో…
“ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ దశలవారీ ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ రెసిడెంట్స్, సూపర్ స్పెషాల్టీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డిఆర్పి, పెరిఫెరల్ పోస్టింగ్లలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్స్ తదితరులు ఆందోళనలో భాగస్వాములు కానున్నారు. పెరిగిన నిత్యవసర ధరలకనుగుణంగా స్టయిఫండ్ 30 శాతం పెంచాలని జూడాలు సుమారు మూడేళ్ల నుంచి కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో అత్యవసర సేవలను కూడా నిలిపేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు ఈశ్వర్ శంకర్, బి దినకర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జి భార్గవసాయి నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూడాల సమ్మెకు సిపిఎం, సిపిఐ ఇప్పటికే మద్దతు తెలిపాయి. తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న జూడాల న్యాయమైన డిమాండ్లపై వైద్యులతో ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే”.