*సూర్యాపేట జిల్లా..*.
NCL ఆక్రమాలపై అధికారుల ఉక్కుపాదం..
సడిసప్పుడు కాకుండా 12 ఎకరాలు కబ్జా..!.
ఇష్ట రాజ్యాంగ అక్రమ నిర్మాణాలు..
కోర్టు ఆదేశాలతో కదిలిన ఫారెస్ట్ అధికారులు..
..
మఠంపల్లి మండలం మట్టపల్లి శివారులో NCL సిమెంట్ ఫ్యాక్టరీలో పోలీస్ పహారా నడుమ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న ఫారెస్ట్ అధికారులు..K దామోదర్ రెడ్డి..జిల్లా ఫారెస్ట్ DFO అధికారి తెలిపిన వివరాలు ప్రకారం…
ఎన్సిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు సర్వే నంబరు 88లో సుమారుగా 12. ఎకరాలు 6కుంటలు . కబ్జా చేసినట్లుగా తమ దృష్టికి రావడం జరిగిందని తెలిపారు.. ఆక్రమించిన భూమిలో పలు రకాల రేకుల షెడ్లతోపాటు,, వాటర్ ప్లాంట్ పలు నిర్మాణాలు కూడా జరిగినట్లుగా తెలిపారు… ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని ఫారెస్ట్ ల్యాండ్ లో ఎటువంటి కట్టడాలు జరిగిన వాటిని వెంటనే కూల్ చేయడం జరుగుతుందని తెలిపారు.. కోర్టు ఆదేశా అనుసారం తాము కూడా కూల్చివేతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు…. కంపెనీ వారికి మార్చి నెలలోనే నోటీసులు అందించడం జరిగిందని తెలిపారు.. ఎన్సిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా కొన్ని రకాల డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగిందని తెలిపారు ఆ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తే అందులో కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ అని తేలడం జరిగిందని తెలిపారు…
ఎన్సీఎల్ NCL మైనింగ్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తో పాటు రైతుల ల్యాండ్లను ప్లీజ్ లో ఉన్నట్టు కబ్జా చేస్తూ చేస్తున్నట్టుగా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి.. .. గుండ్లపల్లి గ్రామస్తులు ఇదే అంశంపై కూడా కొన్నిసార్లు ధర్నా నిర్వహించారు కానీ ఇప్పటివరకు కూడా ఆ ల్యాండ్ పై ఎటువంటి న్యాయం జరగలేదని రైతులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు..
అధికార పార్టీ కొందరు నాయకుల అండదండలతో …!
మట్టపల్లి గ్రామానికి చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమ కట్టడాలని కులుస్తున్న అధికారులపై కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగినట్లుగా వినికిడి.. ఫారెస్ట్ ల్యాండ్ ను కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకులకు ఉన్న అలాకాకుండా ఇండస్ట్రీకి మద్దతుగా నిలవడం పై పలు విమర్శలతో పాటు అనుమానానికి కూడా తావిస్తోంది…
ఎన్సీఎల్ మైనింగ్ చేస్తున్న స్థలాన్ని కూడా పరిశీలించాలని, గుండ్లపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.. అక్రమంగా భారీ స్థాయిలో బ్లాస్టింగ్ పెట్టడం వల్ల గృహ వివాహాల ప్రజలకి తీవ్రస్థాయిలో ఇబ్బందులు కలుగుతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…