మనుగోడు ఓటమి భయంతోనే ఈ స్కెచ్..పోలీసుల ఆధ్వర్యంలో మరో కొత్త డ్రామా…

నల్గొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గ మర్రిగూడ మండలంలో బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మీడియా సమావేశం

కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్ కేసీఆరే

పోలీసుల ఆధ్వర్యంలో మరో కొత్త డ్రామా.

బాధితులు… ఫిర్యాదుదారులు… ముద్దాయిలు వాళ్లే

మనుగోడు ఓటమి భయంతోనే ఈ స్కెచ్

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వద్ద ప్రమాణం చేద్దాం… రా

దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు

సీసీ పుటేజీలన్నీ విడుదల చేయాలి

రెండు టీవీ ఛానళ్లు టీఆర్ఎస్ తో కుమ్కక్కై బీజేపీని బదనాం చేసే కుట్ర

నిషేధించిన గుట్కా వ్యాపారస్తులతో కలిసి టీఆర్ఎస్ ఆడిన నాటకమిది

ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

సనాతన హిందూ సమాజంపై దాడి చేశావ్…

కేసీఆర్…. నీకు రాజకీయ సమాధి తప్పదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని తెలియడంతో కేసీఆర్ బీజేపీని బదనాం చేసేందుకు రెండు టీవీ ఛానళ్లతో కలిసి ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే… ఈ వ్యవహారానికి సంబంధించి ఫాంహౌజ్ లో, హోటల్ లో, ప్రగతి భవన్ లో గత వారం రోజులుగా జరిగిన సీసీ పుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమేలేదని… ఇదే విషయంపై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే… భార్యాపిల్లలతో కలిసి యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతోపాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని స్పష్టం చేశారు. కొద్ది సేపటి క్రితం మర్రిగూడ మండలంలోని తిరగండల్లపల్లిలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం డ్రామాలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయనేమన్నారంటే….

•ఈరోజు జరిగిన డ్రామాను చూస్తే నవ్వొస్తుంది. ఫిర్యాదు చేసింది వాళ్లే.. బాధితులు వాళ్లే.. నేరస్తులు వాళ్లే…
• దీనికి రెండు, మూడు ఛానళ్లు అత్యుత్సాహం చూపినయ్. వాటిని చూసి జనం నవ్వుతున్నరు. బీజేపీని బదనాం చేసేంత సీన్.
• మునుగోడు జనం నవ్వుకుంటున్నరు. మీ నటనను చూసి కేసీఆర్ ఇంకా డ్రామాలు బంద్ చేయలేదు.
• రెండు ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు ముందే అక్కడే ఉన్నరు. టీ ఛానల్ అందులో ఉన్నరు. పోలీసులైతే ఏకంగా కొన్ని సీన్స్ షూట్ చేసి పెట్టినయ్…
• అసలా ఫాంహౌజ్ ఎవరిది? స్వామిజీలను కేసులో ఇరికిస్తారా? హిందూ ధర్మ మంటే అంత చులకనా?
• సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన కుట్ర ఇది. అక్కడ స్వామిజీలను పిలిపించుకుని ఈ స్టోరీ ప్లాన్ చేసిండు.
• ముఖ్యమంత్రి కేసీఆర్…. నువ్వు యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి రా… టైమ్.. డేట్ ఫిక్స్ చేయ్… మేమంతా అక్కడికి వస్తాం. ఇదంతా నిజంగా జరిగిందేనని, ఇందులో నీ స్కెచ్ లేదని ప్రమాణం చేస్తావా… కేసీఆర్?
• ఇదంతా దక్కన్ కిచెన్ హోటల్ లో జరిగిందన్నవ్ కదా… ఆ హోటల్ లో గత 3, 4 రోజుల సీసీ పుటేజీని పూర్తిగా విడుదల చేసే దమ్ముందా?
• ఆశ్చర్యమేమిటంటే టీఆర్ఎస్ నాయకులు 3 రోజుల నుండి అక్కడే అడ్డా పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రోజూ ప్రగతి భవన్ కు ఉదయం వెళ్లి రాత్రి వరకు ఉంటున్నడు. ఇది వాస్తవం. దమ్ముంటే ప్రగతి భవన్ సీసీ పుటేజీలన్నీ విడుదల చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి.
• ఈ డ్రామా వెనుక పోలీసాఫీసర్ పాత్ర ఉంది. గతంలోనూ ఓ మంత్రి తనపై హత్యాయత్నం చేసినట్లు డ్రామా చేయించడంలో ఈ పోలీసాఫీసరే అత్యుత్సాహం చూపారు.
• నిజం చెప్పాలంటే ఈరోజు ఏ ఎమ్మెల్యేలైతే ఉన్నారో…. వాళ్ల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనేందుకు సిద్ధంగా లేరు. వాళ్లను కొనాల్సిన ఖర్మ కూడా బీజేపీకి లేదు.
• మునుగోడులో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని తేల్చేసినయ్… కొడుకు, అల్లుడుసహా అంతా ఇక్కడే తిష్టవేసినా లాభం లేకపోవడంతో కేసీఆర్ ఈ కొత్త డ్రామాకు తెరదీసిండు. తద్వారా భవిష్యత్తులో పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవడానికి కూడా ఈ స్కెచ్ వేశారు కేసీఆర్. ఈరోజు పట్టుబడ్డ స్వామీజీ ఇటీవల పరిగి సమీపంలో పూజలు చేశారు. అక్కడ ఎవరెవరిని కలిశారు?
• కమీషనర్ చెబితేనే పోలీసులు ఆ ఫాంహౌజ్ కు వెళ్లినట్లు పోలీసులే చెప్పారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఎవరో అనామకుడు పిలిస్తే ఎమ్మెల్యేలు వెళ్లారట… పైగా వాళ్ల ఫాంహౌజ్ కు వాళ్లే వెళ్లడం.. వాళ్లే పోలీసులకు ఫోన్ చేయడం… 3 గంటలు అక్కడే ఎదురు చూడటం… తమను కాపాడాలని పోలీసులకు ఫోన్ చేయడం… ఇదంతా చూస్తుంటే నవ్వొస్తుంది.
• దీనికంతటికీ స్కెచ్ వేసింది కేసీఆరేనని ఇప్పుడే ఆ ఎమ్మెల్యే చెప్పారు. మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని చెబుతున్నరు.
• కేసీఆర్… నీ చేతిలో అధికారం ఉంది కదా.. దమ్ముంటే నీ ఎమ్మెల్యేల, స్వామిజీల కాల్ లిస్ట్ బయటపెట్టాలి. ఆ హోటల్ లో, ఫాంహౌజ్ లో, ప్రగతి భవన్ లోని సీసీ పుటేజీ బయటపెట్టాలి.
• అసలీ వంద కోట్లు యాడనుండి వచ్చినయో బయటపెట్టాలి. స్వామిజీలు గత వారం రోజులుగా ఎవరెవరినీ కలిశారో బయటపెట్టాలి. గతంలో బెంగళూరులో బేరసారాలు జరిగినట్లు వార్తలొచ్చినయ్ అవన్నీ బయటపెట్టాల్సిందే.
• అట్లాగే కేసీఆర్ కు దమ్ముంటే… ఆయన నిజాయితీపరుడివైతే భార్యాపిల్లలతోపాటు ఆ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి వద్దకు వచ్చి ప్రమాణం చెయ్యాలి.. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
• ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తం బండారం బయటపెడతాం…
• కొంతమంది టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా వాగుతున్నరు. నోటిని హద్దులో పెట్టుకుని మాట్లాడాలి. బలుపెక్కి అహంకారం తలకెక్కి ఫాల్తు నాకొడుకులంతా బీజేపీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కార్యకర్తలే ఉరికించి కొడతారు.
• మేధావులు, ప్రజలు… మీ డ్రామాలు చూసి ఫక్కున నవ్వుకుంటున్నరు. సనాతన హిందూ ధర్మం మీద తప్పుడు ప్రచారం చేయడానికి కేసీఆర్ ఆడిన డ్రామా ఇది. హిందూ సమాజం నిన్ను క్షమించదు. నీకు రాజకీయ సమాధి తప్పదు.
• ఆధారాల్లేకుండా పోలీసు ఇలాంటి డ్రామాలు చేస్తే ప్రజలు, కార్యకర్తలు ఉరికించి ఉరికించి కొడతారు.