బీఆర్ఎస్ మ్యానిఫెస్టో 2023..
అక్టోబర్ 15న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేయబోతారు అనే దాని గురుంచి పూర్తి ప్రణాళికను వివరించారు.
దళిత బంధుతో ఇప్పటివరకు బీసీల కోసం కొనసాగుతున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఇప్పుడు కొనసాగుతున్న పథకాలు అలాగే కొనసాగుతాయని కేసీఆర్ ప్రకటించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో!
మైనారిటీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ఉన్న 93 లక్షల పైచిలుకు రేషన్ కార్డు కుటుంబాలకు వందకు వంద శాతం ప్రీమియం చెల్లించి రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికీ ధీమా పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించారు. ఎల్‌ఐసీ ద్వారానే ఈ బీమా కల్పించానున్నారు. 93 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3600 నుంచి రూ.4వేలు ఖర్చయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు వచ్చే ఏప్రిల్, మే నుంచి సన్నబియ్యాన్ని తెలంగాణ అన్నపూర్ణతో సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఆసరా పెన్షన్లను ప్రతి సంవత్సరం 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
దివ్యాంగులకు 4,016 పెన్షన్‌ను వచ్చే 5 ఏళ్లలో రూ. 6 వేలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు.
రైతు బందును మొదటి సంవత్సరం రూ.12వేలకు ఇచ్చి… ఆ తర్వాత ప్రతి ఏడాది విడతలవారీగా రూ.16వేలకు పెంచానున్నట్లు పేర్కొన్నారు.
సౌభాగ్యలక్ష్మీ పథకం కింద బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి
తెలంగాణలో అర్హులైన మహిళలకు, అక్రిడేషన్ ఉన్న జర్నిలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు.
ఆరోగ్య శ్రీ పరిధి రూ.15లక్షలకు పెంపు. జర్నలిస్టులకు రూ.15లక్షల వరకు ఉచిత వైద్య సేవలు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పేరు పెట్టారు.
హైదరాబాద్‌లో మరో లక్ష బెడ్రూం ఇండ్లు కట్టడంతో పాటు.. ఇండ్లు ఉన్నవారికి గృహలక్ష్మీ కొనసాగిస్తూనే.. ఇండ్ల స్థలాలు లేనివారికి జాగాలు కూడా ఇవ్వనున్నారు.
46 లక్షల మంది స్వశక్తి మహిళా గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. పక్కా భవనాలు లేని గ్రూపులకు ప్రభుత్వమే విడతలవారీగా భవనాలు కట్టించనున్నట్లు తెలిపారు.
అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు .
అసైన్‌డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి.. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పించే ప్రయత్నం.
ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌పై భరోసా కల్పించానున్నట్లు పేర్కొన్నారు.
▪️ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు.
▪️అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
– సీఎం కేసీఆర్
▪️తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం – సీఎం కేసీఆర్
▪️రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం – సీఎం కేసీఆర్.
▪️ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు
▪️అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
▪️వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు
▪️రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు
▪️మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇస్తాం.
▪️అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3000 అందిస్తాం.
▪️అర్హులైన లబ్దిదారులకు, అక్రిడేశన్ కలిగిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్.