ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్ ఉంది..ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా..
అల్లూరి జిల్లా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్ ఉందని, ఛత్తీస్ఘడ్, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు…
ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్ ఉంది.. ఛత్తీస్ఘడ్, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంటెలిజెన్స్కి పూర్తి సమాచారం ఉండటంతో నిన్న ఆపరేషన్ చేశాం.. ఏపీ ఇంటెలిజన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా.
నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారు.. మావోయిస్టు షెల్టర్ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయి.. 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశాం.. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో మావోయిస్టులు పట్టుబడ్డారు అన్నారు..