Ap ZPTC-MPTC Elections: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అత్యంత తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఫలితాల కోసం గ్రామస్థులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో, పోటీలో నిలిచిన అభ్యర్థే ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం ఎంపీటీసీ (Ap ZPTC-MPTC Elections)స్థానంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన గారపాటి దివ్య (28) కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. తీరా ఓట్లు లెక్కించగా వైకాపా అభ్యర్థిపై ఆమె 352 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్నారు..
Ap ZPTC-MPTC Elections.
విశాఖ జిల్లా: పద్మనాభం మండలం మద్ది ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి నగేష్ కుమార్ విజయం..
గందవరం ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి గణపతి రాజు ఉదయకుమారి గెలుపు
బాందేవిపురం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి వగల సంధ్య విజయం..
పోట్నూరు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి గురంపల్లి శ్రీను గెలుపు..