వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఆ పార్టీ అధినేత జగన్…

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై తప్పుడు కేసులు బనాయించి, నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పాలన నడుస్తోందని, ఇది అత్యంత హేయమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.

గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిశాక, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం నుంచి నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌కు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దించారని జగన్ ప్రశ్నించారు. ఈ అక్రమాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. తప్పు చేసి, బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేస్తూ, మళ్లీ తమ వారిపైనే అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం కేసులు పెట్టడం కంటే దుర్మార్గం ఏముంటుందని నిలదీశారు.

ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి, “ఈ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల నుంచి బ్యాలెట్ బాక్సుల వరకు అన్నింటినీ రిగ్గింగ్ చేస్తున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే, ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? అధికార, పోలీసు బలంతో అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తోంది. ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు” అని జగన్ తన ట్వీట్‌లో హెచ్చరించారు..

గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తయిన తర్వాత, నేరుగా నాగార్జున యూనివర్శిటీ కౌంటింగ్ కేంద్రానికి చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులను మధ్యలోనే నల్లపాడు వద్ద ఎందుకు దింపారని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఆ బ్యాలెట్ బాక్సులను రోడ్డుపైకి తెచ్చారు? వాటి భద్రతకు బాధ్యులెవరు? అని నిలదీశారు. స్ట్రాంగ్‌ రూంకు వెళ్లాల్సిన బ్యాలెట్‌ బాక్సులు నడిరోడ్డుపై కనిపిస్తే, వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిరసన తెలిపిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై లాఠీఛార్జి చేయడం ఏంటని నిలదీశారు. తప్పులు చేసి, బ్యాలెట్‌ బాక్సులను మార్చేందుకు ప్రయత్నించిన వారే తిరిగి శాంతియుతంగా ఆందోళన చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. చివరికి ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం వంటి తప్పుడు కేసులు మోపడం దారుణమని జగన్ ధ్వజమెత్తారు.

ఈ స్థానిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు, స్క్రూట్నీ, పోలింగ్‌ బూత్‌లు, పోలింగ్‌ శాతాల వరకు ప్రతి దశలోనూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. చివరకు పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్సులను కూడా రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఈ అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారు. అధికార, పోలీసు బలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని భావిస్తే ఎన్నికల అక్రమాలు దాగిపోవని, ఈ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా గమనిస్తోందని అన్నారు. ప్రజలు ఈ దుర్మార్గాలను ఎంతమాత్రం సహించరని, త్వరలోనే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని జగన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.