అరుణాచలం వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

అరుణాచలం వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

హైదరాబాద్ నుండి అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుండి అరుణాచలానికి నేరుగా రైలు సర్వీసులను ప్రారంభించింది. గతంలో తిరుపతి, చెన్నై మీదుగా రైళ్లు మారి వెళ్లాల్సిన తిప్పలు తప్పడంతో పాటు, ప్రయాణ సమయం, ఖర్చు తగ్గి ఈస్ట్ హైదరాబాద్ భక్తులకు ఎంతో లబ్ధి చేకూరనుంది.