ఆటో డ్రైవర్ల అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం…

ఆటో డ్రైవర్ల అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నిన్నటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్బంధాలు, అరెస్టులతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లలో వేలాది మంది ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని బంధించి ఉంచడం దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, గొంతు నొక్కేలా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ల నేతలను, ఆటో డ్రైవర్లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటనను, ఆటో అన్నలు కోరినట్లుగానే ఈరోజే అసెంబ్లీలో ప్రభుత్వం చేయాలని ఆయన కోరారు.
ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వారి ఆత్మహత్యలు కొనసాగుతాయని ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959