బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
దేవరకొండ ………
ఉపాధ్యాయ వృత్తి లో పనిచేస్తూ ఉత్తమ విద్యార్థులను కీర్తి దిద్దేది గురువేనని ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి విధి అని లయన్స్ క్లబ్ ఎం జె ఎఫ్ 320 ఈ నల్గొండ గవర్నర్ లయన్ కె.వి.ప్రసాద్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్ను ల ను పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయినీలకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్ కె వి ప్రసాద్ గార్లపాటి జితేందర్ ,కుంచకూరి యాదయ్య, లతోపాటు హయత్ నగర్ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ లను పాఠశాల చైర్మన్ ఇల్లందుల శ్రవణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్యల ను శాలువాల తో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల యొక్క జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని అన్నారు . తాము సైతం విద్యార్థి దశ నుండే వచ్చామని నేడు పోటీ ప్రపంచంలో మెరుగైన విద్యను పొందేందుకు విద్యార్థులు పోటీ పడాలని తెలిపారు. ఉపాధ్యాయుల బోధనలో విద్యార్థులు తమకు తాముగా మంచి జీవితాన్ని ఎంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండారు నిచ్చెల, లయన్స్ క్లబ్ సెక్రటరీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి ,కోశాధికారి చిలుకూరి కాశీనాథ్ ,తదితరులు పాల్గొన్నారు.