సూర్యాపేట జిల్లా….
హుజూర్నగర్లో బాల్య వివాహం జరిగినట్లు వచ్చిన సమాచారం మేరకు ICDS సెక్టార్ ఇంచార్జి సారెడ్డి సోమమ్మ విచారణ చేపట్టారు. విచారణలో సీతారాంపురం గ్రామానికి చెందిన నాయిని అనిల్ కుమార్ అనే వ్యక్తి, అనంతగిరి మండలం పాలేరు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ఈ నెల 9వ తేదీన వారి తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకున్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల తరఫున ఫిర్యాదు అందడంతో హుజూర్నగర్ ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు…