బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

*అమరావతి*

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన హోం మంత్రి అనిత

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలి : హోం మంత్రి అనిత

కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి అని ఆదేశం

ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు

కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

సహాయక చర్యలకు NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలి

మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

పొంగిపొర్లే కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచన

ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు క్రింద, శిధిలావస్థలో ఉన్న వాటి దగ్గర నిలబడరాదు….

హైదరాబాద్లో వర్షాల కారణంగా కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి. ట్రాఫిక్ పోలీసులు.

హైదరాబాద్లో వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గురువారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. శుక్రవారం కూడా పడుతుండడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అప్రమత్తమైంది. దీంతో కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. అలాగ్ హైదరాబాద్లో ట్రాఫిక్ అప్డేట్స్ను ఇస్తుంది..

దసరా సెలవులకు ఊరెళుతున్నారా… బీ అలర్ట్ : బంగాళాఖాతంలో వాయుగుండంతో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

_దసరా పండగ వచ్చేసింది.. స్కూళ్లకు ఆల్రెడీ సెలవులు కూడా ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడు ఊళ్లకు వెళ్లి పండగ సెలవులు ఎంజాయ్ చేద్దామా అని పిల్లలు ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిలైన ఫ్యామిలీస్ ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు._

_ఇక వీకెండ్ కూడా రావడంతో లీవ్స్ ప్లాన్ చేసుకొని ఏపీలోని తమ ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే ఈ అలర్ట్ మీకోసమే… వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ._

_బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు హోమ్ మంత్రి అనిత.ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి అనిత._

_అవసరమైన ప్రతిచోట కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని.. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి అనిత. సహాయక చర్యలకు NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు._

_ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని సూచించారు అధికారులు.పొంగిపొర్లే కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయద్దని.. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు క్రింద, శిధిలావస్థలో ఉన్న వాటి దగ్గర నిలబడద్దని సూచించారు అధికారులు.