సీఎం రేవంత్ రెడ్డి అహంకారం వ‌ల్ల‌, ఏక‌ప‌క్ష నియంతృత్వ పోక‌డ‌ల‌తో ఎల్ అండ్ టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంది.. కేటీఆర్..

సీఎం రేవంత్ రెడ్డి అహంకారం వ‌ల్ల‌, ఏక‌ప‌క్ష నియంతృత్వ పోక‌డ‌ల‌తో ఎల్ అండ్ టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ సంస్థ‌కు హైద్రాబాద్ మెట్రో విష‌యంలో 2070 దాకా లీజు ఉంది అంటే 45 ఏండ్లు ఇంకా స‌మ‌యం ఉంది. ఇవాళ ఎల్ అండ్ టీ ఎందుకు వెళ్లిపోయిందో సీఎం స‌మాధానం చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉన్న హైద‌రాబాద్ నుంచి ఆ సంస్థ వెళ్లిపోయిందంటే అది తెలంగాణ రాష్ట్రానికి మాయ‌ని మ‌చ్చ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు..
రేవంత్ రెడ్డి అహంకార పూరిత వైఖరి, నియంతృత్వ పోకడలతో L&T లాంటి ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన సంస్థ వెళ్ళిపోయింది

కొవిడ్ లాంటి కష్ట సమయాల్లో, నష్టాలు వచ్చినప్పుడు, రాష్ట్ర విభజన సమయంలో అపోహలను తట్టుకొని నిలబడ్డ L&T సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది

వారికి 2070 వరకు లీజుకు ఉంది.. తెలంగాణ రైసింగ్ అని అంటున్నారు మరి L&T సంస్థ ఏ కారణంతో వెళ్ళిపోయింది..

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదట తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రద్దు

టెండర్లను పిలిచి, భూ సేకరణ జరిగాక కూడా ఆ నిర్ణయాన్ని రద్దు చేశాడు

లేదంటే ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో లైన్ నిర్మాణం జరిగి మొదలయ్యేది

రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టి అన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడు..మేము దిగిపోయేప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద మెట్రో హైదరాబాద్

మన దగ్గర ఎయిర్ పోర్టుకు మెట్రో లేదని.. మైండ్ స్పేస్ నుండి శంషాబాద్‌కి మెట్రో వేయడానికి టెండర్ పూర్తి చేసి శంకుస్థాపన కూడా చేసాము….
ఎక్కడైనా పరిశ్రమలు పెడితే అక్కడుండే చిన్న చిన్న గుండాలు, ఆకు రౌడీలు మాములు ఇవ్వాలని బెదిరిస్తారు

కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బెదిరించే స్థాయికి వచ్చింది

హైదరాబాద్‌లో ఫ్రీ బస్సు వల్ల మెట్రోకు మాకు నష్టం వస్తుందని L&T CFO అంటే, ఆయనను తీసుకెళ్లి జైల్లో వేయండి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు

రేవంత్ రెడ్డి నియంతలాగా, ఉత్తర కొరియా పొట్టొడిలాగా ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో వేస్తానని డాగులు వేస్తున్నాడు…ప్రభుత్వం మెట్రోకు ఇచ్చిన 280 ఎకరాల భూమి మీద రేవంత్ రెడ్డికి కన్ను పడింది

L&T సంస్థను వెళ్లగొట్టి, ఆ 280 ఎకరాలను పంచుకోవాలని వీళ్ళు చూస్తున్నారు

అలాగే కొన్ని మాల్స్ ఉన్నాయి వీటన్నిటిని రేవంత్ రెడ్డి తన స్నేహితులకు, దగ్గరగా ఉండే సంస్థలకు రాసివ్వాలని చూస్తున్నాడు….పండుగలు వచ్చాయంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్ డబుల్ చేస్తున్నారు

మహిళలకు ఫ్రీ అంటూ పురుషులకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు

రేవంత్ రెడ్డి తీసుకున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్ణయం వల్ల, ఆర్టీసీలో దాదాపు 20 వేల మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది

ఫ్రీ బస్సు పథకం వల్ల ప్రభుత్వం బకాయిలు పడింది, సంస్థ నష్టాల్లో ఉందని కార్మికులు అంటున్నారు

ఉన్న ఆర్టీసీనే నడిపే మొహం లేదు, మెట్రో నడిపిస్తాడా?…వ‌డ్డీ లేని రుణం ఇస్తామ‌ని చెప్పి.. 2070 దాకా న‌డ‌పాల‌ని ధైర్యం చెప్పి ప్ర‌భుత్వం నుంచి సాఫ్ట్ లోన్ కింద రూ. 900 కోట్లు కేబినెట్ అనుమ‌తితో ఇచ్చాం. ఎల్ అండ్ టీ ముందుకు పోయింది. పీక్ అవర్స్‌లో స‌రిపోవ‌ట్లేదు కోచ్‌లో పెంచండి అని అడిగారు. అందుకు అనుగుణంగా కోచ్‌లు కూడా పెంచామ‌ని కేటీఆర్ తెలిపారు.

69 కిలోమీట‌ర్లు మెట్రోను పూర్తి చేశాం పాత‌బ‌స్తీ మిన‌హా. హైటెక్ సిటీ ఆవాస హోట‌ల్ వ‌ద్ద‌కే మెట్రో ఉంటే.. ఐటీ ఉద్యోగుల‌ను దృష్టిలో ఉంచుకుని దాన్ని ర‌హేజా మైండ్ స్సేస్ వ‌ర‌కు పొడిగించాం. అర్ధ‌వంతంగా, ఆలోచ‌న‌తో మెట్రోను పూర్తి చేశాం. రెండో అతిపెద్ద మెట్రో నెట్ వ‌ర్క్ దేశంలో రెండో అతిపెద్ద వ్య‌వ‌స్థ మేం దిగిపోయ నాడు. ఇంకో ప‌ని చేశాం. దిగ‌పోయే ఆరు నెల‌ల ముందు.. మెట్రో న‌గ‌రాల్లో ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉంద‌ని ఆలోచ‌న చేసి.. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్‌కు ఓఆర్ఆర్ వెంట టెండ‌ర్ పూర్తి చేశాం. శంకుస్థాప‌నం చేశాం. ఎల్ అండ్ టీ టెండ‌ర్ ద‌క్కించుకుంది.. ప‌నులు ప్రారంభించ‌డ‌మే మిగిలి ఉండే. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు కారిడార్‌కు స్థ‌లం సేక‌రించి పెట్టారు వైఎస్సార్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ను దృష్టిలో ఉంచుకుని.. శంషాబాద్ వ‌ర‌కు ఎయిర్‌పోర్టు మెట్రో కోసం ప్ర‌య‌త్నం చేశాం. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో ప్ర‌జా ర‌వాణా మెరుగుప‌ర‌చాల‌నుకున్నాం. శంషాబాద్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఇక్క‌డికి వ‌చ్చి ప‌ని చేసుకునేందుకు ఆలోచ‌న చేశాం.. 37 కిలోమీట‌ర్ల ఎయిర్‌పోర్టు మెట్రోకు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అంకురార్ప‌ణ చేసింది అని కేటీఆర్ గుర్తు చేశారు..