బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితికి…!..ఏడీపీ షాకింగ్ నివేదిక…

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగ్లాదేశ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ ఛాయలు ఆసియా ఖండంలోని అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి అంచనాను గతంలో ఉన్న 4.7 శాతం నుండి 4 శాతానికి తగ్గించింది. ఇలా ఒకే ఏడాదిలో వరుసగా మూడుసార్లు వృద్ధి రేటును తగ్గించడం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితికి అద్దం పడుతోంది..ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగ్లాదేశ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ ఛాయలు ఆసియా ఖండంలోని అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి అంచనాను గతంలో ఉన్న 4.7 శాతం నుండి 4 శాతానికి తగ్గించింది. ఇలా ఒకే ఏడాదిలో వరుసగా మూడుసార్లు వృద్ధి రేటును తగ్గించడం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితికి అద్దం పడుతోంది..

యుద్ధ ప్రభావంతో..

ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ప్రపంచ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సహజ వాయువు ధరలు ఆకాశాన్నంటాయి. దీనివల్ల బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల సరఫరా నిలిచిపోవడంతో ఎగుమతులపై ఆధారపడే బంగ్లాదేశ్ వాణిజ్యం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఫలితంగా 2026 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సుమారు 9 శాతానికి చేరుకోవచ్చని ఏడీబీ హెచ్చరించింది. అంటే నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి…

దివాళా దిశగా..
పశ్చిమాసియా సంక్షోభం ఎంత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా తయారవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ స్థిరత్వం ఏర్పడితే వినియోగం, పెట్టుబడులు కొంతవరకు మెరుగుపడవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే తప్ప బంగ్లాదేశ్ ఈ ఊబి నుండి బయటపడటం కష్టమే. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, పరిశ్రమలను పునరుద్ధరించడం వంటివి ఆ దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లు..