భార్యని కాపురానికి పంపలేదని అత్తను లేపేసే ప్లాన్ చేసిన అల్లుడు,, పోలీస్ కేసులో చిక్కి అరెస్ట్..!

భార్యని కాపురానికి పంపలేదని అత్తను లేపేసే ప్లాన్ చేసిన అల్లుడు, పోలీస్ కేసులో చిక్కి అరెస్ట్ అయ్యాడు. జగిత్యాల జిల్లా జగదేవ్ పేటలో భర్తతో గొడవ పెట్టుకుని, భార్య పుట్టింటికి వచ్చింది. అత్త, తన భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు మల్లారెడ్డి ఆగ్రహం చెందాడు. దీంతో రాత్రి సమయంలో కరెంట్ పోల్ నుంచి ఒక వైర్ ను మామగారి ఇంటి తలుపుకు కనెక్ట్ చేసాడు. ఉదయాన్నే అత్త తలుపు తీసి, ఇంటిముందు శుభ్రం చేస్తుందని తెలిసి. అందుకే ఆమె తలుపు తీయడంతోనే, షాక్ కొట్టి చనిపోతుందనుకున్నాడు. అయితే ఆమె షాక్ తగలడంతోనే అరిచి పడిపోయింది. తరువాత ఇరుగు పొరుగు వచ్చి చూస్తే, అల్లుడే తలుపునకు కరెంట్ పెట్టి, అత్తను చంపే ప్రయత్నం చేశాడని తేలింది. పోలీసులు అల్లుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.