బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. భారత్ కు వ్యతిరేకంగా అక్కడి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్ ఐపీఎల్ పాల్గొనకూడదు అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. వారు మన హిందువలపై దాడులు చేస్తుంటే..మనం మాత్రం ఆ దేశ క్రికెటర్లను ఆడించాలా అంటూ సోషల్ మీడియా అంతా గగ్గోలు పెట్టింది. దీంతో అతనిపై బీసీసీఐ వేటు వేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీవేలంలో కేకేఆర్ అతన్ని రూ.9.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అతన్ని రిలీజ్ చేయమని బీసీసీఐ కోల్కతా నైట్ రైడర్స్ను ఆదేశించింది. దీని వెంటనే బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తాము భారత్లో జరగనున్న టీ20 వరల్డ్కప్లో భద్రతా కారణాల రీత్యా పాల్గొనలేమని, తమ మ్యాచ్ వేదికలను మరో చోటుకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. ఐసీసీకి లేఖ కూడా రాసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.