స్వాతంత్ర్యం ఇప్పిస్తే.. భారత్‌నే టార్గెట్ చేస్తున్నారు…!

గతంలో బంగ్లాదేశ్ పరిస్థితి రాచరికం రాజ్యమేలుతూ అరాచకాలు కళ్ళు ఎదిరి జరుగుతున్న కనీసం ప్రశ్నించేవారు ఆ రోజు బంగ్లాదేశ్ ఢాకాలో ISI సెల్ ఓపెన్ అయింది. పాకిస్తాన్‌లో ఉండాల్సిన అక్కడి ఆర్మీ మేజర్స్, కల్నల్స్, బ్రిగేడియర్స్… ఇవాళ ఢాకాలో తిష్ఠవేశారు…ఏం పని వాళ్లకి? మొన్న నవంబర్‌లో కొలంబోలో జరిగిన మీటింగ్‌ అజిత్ ధోవల్ ఈ విషయమే అడిగారు. ఢాకాలో ISI సెల్ పెట్టడమేంటని. పిచ్చి సమాధానం చెప్పి ఊరుకుంది బంగ్లాదేశ్.

.. భారత్‌కు విషయమేంటో అర్ధమైంది. విచిత్రమేంటో గానీ.. భారత్‌పై విషం చిమ్ముతున్న వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోయారు.

ఒకరిద్దరు చనిపోతే యాధృచ్చికం. బై యాక్సిడెంట్ చనిపోతే కాకతాళీయం. కాని, 40 మంది చనిపోతే…! వారం క్రితం ఉస్మాన్ హాదీని చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

హాదీ చనిపోయాకే హిందువులపై దాడులు జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి అనుకుంటారు. కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి జరగని జిల్లా అంటూ లేదు. హిందూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు లెక్కే లేదు.

అలా చేస్తున్నందుకే 40 మంది చనిపోయారు. కాకపోతే హాదీ మరణంతో హిందువులపై దాడులు ఈ ప్రపంచానికి తెలిసిందంతే. బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయ్. కాదేమో..

ఇలా చెప్పడం సరైనది కాదు.. కక్ష గట్టి చంపుతున్నారు .. హిందువులే టార్గెట్‌గా బంగ్లాదేశ్‌లో మూక దాడులు జరుగుతున్నాయ్ అనాలేమో. ఇందాక వచ్చిన క్వశ్చనే. హిందువులనే ఎందుకు టార్గెట్ చేయాలి?

అంటే.. పాకిస్తాన్ హస్తం ఉందా? చైనా వెనకుండి నడిపిస్తోందా? ఊరికే అనుమానాలు వ్యక్తం చేస్తే ఎలా..?

ఏదో ఒక ప్రూఫ్ ఉండాలిగా. ఇదిగో ప్రూఫ్.. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ మంత్రులంతా ఒకచోట చేరి.. మీటింగ్…

చైనా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ గురువారం తమ తొలి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం చైనా దక్షిణ యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్‌లో జరిగింది..గత నెలలో చైనా, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఇలాంటి సమావేశం తర్వాత, భారతదేశ పొరుగు ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండవ త్రైపాక్షిక సంభాషణ ఇది.

కున్మింగ్‌లో జరిగిన సమావేశంలో చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్, బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ కార్యదర్శి రుహుల్ ఆలం సిద్ధిక్ మరియు పాకిస్తాన్ అదనపు విదేశాంగ కార్యదర్శి ఇమ్రాన్ అహ్మద్ సిద్ధిఖీ పాల్గొన్నారు. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ వీడియో లింక్ ద్వారా చర్చల మొదటి భాగంలో పాల్గొన్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది..బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ రెండూ “చైనాకు మంచి పొరుగువారు, మంచి స్నేహితులు మరియు మంచి భాగస్వాములు” అని సన్ వీడాంగ్ అన్నారు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ సహకార ప్రాజెక్టులకు రెండు దేశాలు కీలక భాగస్వాములు అని ఆయన అన్నారు